అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో గొడిసెల సురేష్ అనే యువ రైతు పత్తి చేనులోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి సాగు కోసం అప్పులు చేశాడని, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బోథ్ మండలం కుచులపూర్ గ్రామంలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది.  పోస్టుమార్టం కోసం సురేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

error: