అమెరికా కూడా చైనా కు షాక్ ఇవ్వనుందా!

వాషింగ్టన్‌: వివిధ దేశాల్లో చైనాపై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. చైనాకు చెందిన యాప్స్‌ను మన దేశం ఇప్పటికే బ్యాన్‌ చేయగా.. అమెరికా కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఫారెన్‌ సెక్రటరీ స్టేట్‌ మైక్‌పాంపియో అన్నారు. “ అధ్యక్షుడి కంటే ముందే నేను ఈ విషయాన్ని చెప్పాలను కోవడం లేదు. కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం” అని మైక్‌పాంపియో అన్నారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి కంపెనీలు, చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని ఇప్పటికే అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టిక్‌టాక్‌ వంటి యాప్‌లు సేకరించే సమాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లను నిషేధించడం సరైన నిర్ణయమేనని పాంపియో ఇదివరకే స్పష్టం చేశారు. చైనా భారత్‌ మధ్య నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా మన డేటా చోరీకి గురవుతుందనే అనుమానంతో మన దేశం టిక్‌టాక్‌తో పాటు 59యాప్‌లను బ్యాన్‌ చేసింది.

error: