ఆత్మ గౌరవ సభ నుండే ఆశయ సాధన -జగ్గు మల్లారెడ్డి

రేపే ఆత్మ గౌరవ సభకు తరలిరండి ,ఈ నెల 29 న హైద్రాబాద్లో జరిగే ఆత్మగౌరవ సభకు తెలంగాణ రాష్ట్రంలోని కేజీ టూ పీజీ విద్యాసంస్థల్లో పనిచేసే యాజమాన్యాలు ,బోధనా సిబ్బంది,బోధనేతర సిబ్బంది లక్షలాదిగా హైద్రాబాద్లోని గౌరెల్లి కి రేపు తరలి రానున్నారని ట్రస్మా సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు జగ్గు మల్లారెడ్డి తెలిపారు.సిద్దిపేట జిల్లా నుండి అన్ని ప్రైవేట్ విద్య సంస్థల్లో పనిచేసే యాజమాన్యాలు,ఉపాధ్యాయులు వేలాదిగా రానున్నారని అందుకు ట్రస్మా ఆధ్వర్యంలో సిద్ధిపేట లోని బ్లాక్ ఆఫీస్ వద్ద బస్సు సౌకర్యాన్ని ఉదయం పదిన్నర గంటలకు మేము అందించడానికి సిద్ధమన్నారు.ఆత్మ గౌరవ సభకు సంబంధించిన ప్రధాన డిమాండ్స్ …
1.ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.
2.ఉచిత గృహ వసతిని కల్పించాలి.
3.పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న పాఠశాలలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
4.పాఠశాలలకు విద్యుత్ చార్జీలలో రాయితీలు కల్పించాలన్నారు.విద్యాసంస్థలన్నింటికీ ఫైర్ సేఫ్టీ మినహాయింపు ఇవ్వాలన్నారు.
5.పాఠశాలలకు ,జూనియర్ డిగ్రీ కాలేజీ లకు రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని కోరారు.

error: