ఎన్నికలు రాగానే దొంగలంతా ఒక్కటయ్యారని,ఆలీ బాబా 40 దొంగల్లాగా మహాకూటమి ఏర్పడిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేసారు.గడ్డలు,మీసాలు పెంచుకుంటే MLA లు కారని,ప్రజలకు సేవచేసే వారినే గుర్తించి ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు.సీఎం KCR వచ్చాకే యాదవులకు స్వాతంత్రం వచ్చిందని,రాష్ట్రంలో గుర్తింపు లభించిందని తెలిపారు.జనంలో ఆదరణ లేక ఓడిపోతామనే భయంతో హరీష్ రావు ఫై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.యాదవుల ఇష్టదైవమైన కొమురవెల్లి ఆలయాన్ని తెరాస ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు.యాదవులు సిద్ధిపేట పాత బస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు,డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి,యాదవసంగం రాష్ట్ర నాయకులు రమేష్,అధ్యక్షుడు ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు.