ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

తెలంగాణ ఉద్యమంలో ఆ యువకుడు కూడా పాల్గొన్నడు.. సొంత రాష్ట్రం ఏర్పడే సరికి సర్కారీ జాబ్ వస్తదని ఆశపడ్డడు.. పాఠశాల నుంచే చదువులో ముందుండే అతడు ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచిండు.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వచ్చిండు.. కానీ, అతడి ఆశ తీరలేదు.. నోటిఫికేషన్లు లేక నిట్టూర్చిండు.. ఎన్నేండ్లు ఇట్లనే ఉద్యోగం లేకుండా ఉండాలని మదనపడ్డ ఆ యువకుడు చివరికి ఉరి కొయ్యకు వేలాడిండు. సర్కారీ కొలువు రాలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడిండు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మ్యాదరి నవీన్ అనే యువకుడు ఓయూలో టాప్ ర్యాంకర్. 2013లో జర్నలిజంలో పీజీ చేశాడు. అప్పటి ఎంట్రన్స్‌లో నవీన్‌కు స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అప్పటి నుండి ఓయూలోనే ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వచ్చాడు.

కానీ, ప్రభుత్వం వేసిన అరకొర నోటిఫికేషన్లలో ఉద్యోగం రాలేదు. మరోసారి కష్టపడదామనుకుంటే కొత్త నోటిఫికేషన్లు పుట్టలేదు. దీంతో.. ఇంట్లో వాళ్లు, ఊర్లో వాళ్లకు మొహం చూపించలేక తీవ్రంగా మదనపడ్డాడు నవీన్. ఇటీవలే స్వగ్రామం వెళ్లిన అతడు.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

error: