ఒక్క సిక్స్ కి వెయ్యి రూపాయలు,ఎన్ని సిక్స్ లైనా కొట్టండి-మంత్రి హరీష్ రావు

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి జన్మ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ని ఆవిష్కరించి, క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

నాడు రాదనుకున్న తెలంగాణను తానొక్కడే ముందుండి ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ర్టాన్ని సాధించారు. అవహేళనలు, అవమానాలను భరించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమం దేశానికి కొత్త సంస్కరణలు గా ఆదర్శంగా నిలుస్తున్నాయ్. నేడు సిద్దిపేటలో భారీ ఎత్తున జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌కు కూడా ఆయన పేరే పెట్టుకోవడం చాలా సంతోషం గా ఉంది. ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని పరిచయం చేసే గొప్ప ప్రయత్నాన్ని చేపట్టాము. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తాము. నేను ఏ తపన తో అయితే సిద్దిపేట స్టేడియం ను అభివృద్ధి చేసానో.. ఆ అభివృద్ధికి గౌరవ పెద్దలు కేసీఆర్ గారి బర్త్ డే సందర్భంగా సార్థకత రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అభివృద్ధి చేయడం, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకి అందినప్పుడే చేసిన అభివృద్ధికి ఏ నాయకునికైనా సంతృప్తి. అది ఈ రోజు సిద్దిపేట యువత, క్రీడాకారులతో నిదర్శనం అని చూపారు. ఒక్క క్రికెట్టే కాదు. అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌ ఫూల్‌ ఉంది. 16 రకాల క్రీడా వసతులు ఉన్నాయి. ఇప్పుడు రంగనాయకసాగర్‌ పై అంతర్‌ రాష్ట్ర సైక్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. త్వరలోనే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట ప్రాంతం వేదికగా మారనున్నది. ఇటు చదువుకు, అటు క్రీడలకు సమానమైన ప్రాధాన్యతను ఇస్తున్నాం. ప్రతీ యువకుడు ఒక ఆల్ రౌండర్ కవాలి. చదువులో, క్రీడల్లో, సామాజిక బాధ్యతల్లో రాణించాలి. కన్న తల్లిదండ్రులు, గురువుల కలలు నెరవేర్చాలి. చేసే పనిలో నిబద్ధత ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధిస్తాం. క్రీడలను సరదాగా కాకుండా సీరియస్ గా తీసుకుంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. మన హైదరాబాద్ కే చెందిన మహమ్మద్ సిరాజ్ అనే క్రికెటర్ తండ్రి సాధారణ ఆటో డ్రైవర్. అయినా తాను అహర్నిశలు శ్రమించి ఇండియా జట్టుకు ఎంపికై మొన్న ఆస్ట్రేలియాలో మన జట్టును గెలిపించాడు. క్రీడలకు పేద, ధనిక అనే తేడా లేదని, ఆత్మవిశ్వాసంతో పోరాడలనే పట్టుదల, సంకల్పం ఉంటే ఏమైనా చేయొచ్చని సిరాజ్ నిరూపించాడు.

error: