కాంగ్రెస్ లో పైసలున్నోళ్లకే టిక్కెట్లు

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీమంత్రి,దుబ్బాక మాజీ MLA చెరుకు ముత్యం రెడ్డి తనకు టికెట్ దక్కకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు.సిద్ధిపేట జిల్లా దుబ్బాక టికెట్ ను ,కూటమిలో భాగంగా TJS కు కేటాయించారు.దీంతో ఆయన తీవ్రంగా కలత చెందారు.మూడేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కి సేవ చేసిన గుర్తింపు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు.హరీష్ రావు,దుబ్బాక తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి,సిద్ధిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ముత్యం రెడ్డి స్వగృహానికి ఆదివారం వెళ్లి తెరాస లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ముత్యం రెడ్డి మాట్లాడుతూ,సీఎం KCR తో తనకు పదేళ్ల ఆత్మీయ అనుబంధం ఉన్నదని,ఎప్పుడు కలిసిన ముత్తన్న అని ఆత్మీయంగా పలకరిస్తాడని తెలిపాడు.తాను కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఈ నెల 20 న సిద్ధిపేట సభలో సీఎం KCR సమక్షంలో తెరాస లో చేరుతున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ లో పైసల్ ఉన్నోళ్లకే టిక్కెట్లు ఇస్తున్నారు.పార్టీ కోసం కష్టించి పనిచేసిన గుర్తింపు ఇవ్వలేదు.మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో సేవ చేశాను.ఇవ్వాళా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అంటూ ముత్యం రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

error: