- వాళ్ళిద్దరికీ కాలేజీ లో పరిచయం ఏర్పడింది ..ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు …ప్రేమలో మునిగి తేలారు..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు…కానీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు…అసలు ఎం జరిగిందంటే ….
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం శ్రీరాంపూర్ కు చెందిన తగరం మణెమ్మ ,స్వామి దంపతుల రెండో కూతురు మల్లికా..రామకృష్ణ పూర్ లోని అల్లూరి సీతారామరాజు నగర్ కు చెందిన షేరు సంతోష్ మంచిర్యాలలో ఓ కళాశాలలో చేరారు. ఇంటర్ లోనే పరిచయం ఏర్పడగా డిగ్రీలో
అది ప్రేమ గా మారింది.ఈ విషయం ఇరు కుటుంబాలలో తెలిసింది.వారు కూడా అడ్డు చెప్పలేదట..సంతోష్ చదువు మానేసి ఇంటి వద్దనే ఉండున్నాడు..ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడని ,ఇంట్లో మందలించారని 21 న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం .అది తెలుసుకున్న మల్లికా మనస్తాపానికి గురైంది..వారి బంధువుల ఇంటికి వెళ్తుండగా ఆటోలోంచి గోదావరిలోకి దూకింది .26 న రాత్రి వరకు మృతదేహాన్ని పోలీస్ లు బయటకు తీయించారు.ప్రియుడు లేని లోకంలో తాను ఉండలేనని ఈఅఘాయిత్యానికి పాల్పడిందని పోలీస్ లు తెలిపారు.
Tags boy sucide commitment crime family problems love online games Sucide
TS24 News