కిరాతకుడితో తల్లికి ఎఫైర్,కొడుకు హతం

నిజామాబాద్‌ జిల్లాలో అంజి అనే బాలుడి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. బాలుడి తల్లిలో కిడ్నాపర్‌కు అక్రమ సంబంధం ఉందని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో అపహరణకు గురై నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్‌ సమీపంలో విగతజీవిగా కనిపించిన చిన్నారి అంజి (16 నెలలు) కేసులో పోలీసులు షాకింగ్ విషయం బయటపెట్టారు.
నిందితుడు నాగరాజుకు బాలుడి తల్లితో అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి భర్త తనను కొట్టాడని కక్ష పెంచుకున్న నాగరాజు ఆ కోపంతోనే బాలుడిని కిరాతకంగా చంపేసినట్లు నిర్ధారించారు. శుక్రవారం ముథోల్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు ఈ కేసు పూర్తి వివరాలను వెల్లడించారు.

బాసరకు చెందిన ఉడుము నాగరాజు చిన్నప్పుడే గ్రామం నుంచి పారిపోయి మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌ మండలం పాలట గ్రామంలో నివాసముంటున్నాడు. అక్కడే ఓ మహిళను వివాహం చేసుకున్న అతడు కొంతకాలానికే ఆమెతో విడిపోయాడు.
ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని ఆకులకొండూర్ గ్రామానికి వెళ్లి ఒంటరిగా ఉండేవాడు. నిజామాబాద్‌లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న సమయంలో అతడికి నవిపేటకు చెందిన రమేష్‌ పరిచయమయ్యాడు. అతడి సలహాతో నాగరాజు తన మకాంను నవిపేటకు మార్చాడు.
ఈ క్రమంలోనే రమేష్‌ ఇంటికి తరచూ వెళ్తూ అతడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న రమేష్‌ స్థానిక కల్లు కంపౌండ్‌లో నాగరాజును తీవ్రంగా కొట్టడంతో అతడు ఊరు వదిలి వెళ్లిపోయాడు. తనను రమేష్ అందరి ముందూ కొట్టాడని, ఎలాగైనా పగ తీర్చుకోవాలని నాగరాజు నిర్ణయించుకుని సమయం కోసం వేచిచూశాడు.
పది రోజుల క్రితం రమేష్ భార్య నాగరాజుకు ఫోన్ చేసి తన భర్త ఓ కేసులో సంగారెడ్డి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పింది.
దీనికి అతడు సరేననడంతో ఈ నెల 18వ తేదీన కొడుకు అంజితో కలిసి నాగరాజును కలిసింది. ఇద్దరూ సంగారెడ్డి వెళ్లి రమేష్‌ను కలిసిన తర్వాత సాయంత్రానికి నిజామాబాద్ చేరుకున్నారు.
తన కొడుక్కి ఆకలి వేస్తుండంతో పాలు తీసుకురావాలని ఆమె కోరడంతో నాగరాజు బాలుడిని తీసుకుని వెళ్లాడు.
ప్రేమంటూ షికార్లు చేసి ఉద్యోగం రాగానే వదిలేశాడు
ఆ సమయంలోనే రమేష్‌పై పగతో అతడి కొడుకుని చంపేయాలని నాగరాజు నిర్ణయించుకున్నాడు. అంజిని హోటల్‌కు తీసుకెళ్తున్నట్లు నటించి ఆటోలో నిజామాబాద్ శివారులోని అర్సపల్లి కాలనీకి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగి రాత్రి 11 గంటల సమయంలో ఓ దుకాణం ముందు బాలుడి తలని సిమెంట్ దిమ్మకు కొట్టి చంపేశాడు.
మరుసటి రోజు ఉదయం వరకు అక్కడే పడుకున్న నాగరాజు తర్వాత బాలుడి శవంతో బాసర చేరుకున్నాడు.
అంజి మృతదేహాన్ని రైల్వేస్టేషన్‌ సమీపంలోని పొదల్లో వదిలేసి పారిపోయాడు.

ఆగడాలు వెలుగులోకి
అప్పటి నుంచి బిడ్డ కోసం గాలిస్తున్న ఆమె ఈ నెల 25వ తేదీన నిజామాబాద్‌లో నాగరాజు కనిపించడంతో నిలదీసింది.
తండ్రితో కలిసి ఆ కిరాతకుడిని చెట్టుకు కట్టేసి కొట్టడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాసర పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీనిపై బాసర పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి

error: