కిరాతక తనయుడు

ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చేందుకు ప్రయత్నించాడో కిరాతక కొడుకు. డబ్బు కోసం జన్మనిచ్చిన తల్లిపై దాడికి తెగబడ్డాడు. బీరు సీసాను పగులగొట్టి గొంతులో పొడిచాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిట్టమ్మ (65)తో ఆమె కొడుకు సూరిబాబు నిత్యం గొడవ పడుతుండే వాడు. ఆస్తిని తన పేరిట రాయాలంటూ బెదిరించే వాడు. ఈ క్రమంలో సోమవారం కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తల్లిపై కోపంతో ఊగిపోయిన సూరిబాబు.. మద్యం మత్తులో ఆమెపై బీరు సీసాతో దాడి చేశాడు. గొంతులో పొడవడంతో కిట్టమ్మకు తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు ఆమెను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లిపై దాడి చేసిన అనంతరం సూరిబాబు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

error: