కేవలం వారికోసమే ఈ పెళ్లి – సింగర్ సునీత

సునీత రెండో పెళ్లీ చేసుకుంటుందని, మళ్ళీ సునీత కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతుంది అని గత కొద్దీ రోజుల కింద నుండి చక్కర్లు కొడుతున్నా, సునీత మొన్న చేసుకున్న ఎంగేజిమెంట్ తో అది నిజమే అని తెలిసింది.కానీ తాను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరికీ తెలియదు అని కేవలం నేను నా పిల్లల కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని ఫేస్బుక్ వేదికగా చెప్పుకొచ్చింది . తాను తన పిల్లలకోసం కోరుకున్న క్షణం తన జీవితంలో ఎట్టకేలకు వచ్చిందని , తనకు కొత్త జీవితం కావాలని కోరుకుంటున్న పిల్లలు ఉన్నందుకు తానూ అదృష్టవంతురాలునని పేర్కొన్నారు .
ఒక మంచి స్నేహితుడిగా రామ్ తన జీవితంలోకి వచ్చి జీవిత భాగస్వామి గా మారబోతున్నారని ఆమె వెల్లడించారు.తన లైఫ్ కి సంబందించిన రహస్యాలను ప్రైవేట్ గా ఉంచుతున్నానని ఆ విషయాన్నీ అర్థం చేసుకున్న శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేస్ బుక్ వేదికగా వెల్లడించారు .

error: