కేసీఆర్,జగన్ భేటి

వీలైనంత తక్కువ భూసేకరణతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలించే విషయంతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాల పై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతి భవన్‌లో సుదీర్ఘ చర్చ జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి ఎలా తరలించాలి, అలైన్‌మెంట్ ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగం ఉండాలని..దీనికోసం రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయించారు.

అంతేకాదు విద్యుత్, పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఇద్దరు సీఎలు చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో 18వేల మంది పోలీసులను ఒకే సారి నియమిస్తున్నందున అందులో 4వేల మందికి ఏపీలో శిక్షణనివ్వాలని ఏపీ సీఎం జగన్‌ను కేసీఆర్ కోరారు. పోలీసులకు ఒకే సారి శిక్షణనివ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలతో పాటు రెండు రెష్ట్రాలకు సంబంధించిన ఇతర విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.

ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు 4 గంటల పాటు చర్చించారు. సమావేశంలో గోదావరి-కృష్ణా అనుసంధానం, విభజన చట్టం 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థలపై కేసీఆర్, జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వైఖరి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా సమావేశంలో చర్చలు జరిపారు. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. తిరుమల బ్రహ్మత్సవాలకు హాజరవ్వాల్సిందిగా టీటీడీ తరపున కేసీఆర్‌ను ఆహ్వానించారు జగన్.

error: