అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎబివిపి రాష్ట్ర పిలుపు మేరకు సిద్దిపేట శాఖ నగర కార్యదర్శి సురేందర్ ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్నటువంటి 220కోట్లను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని అలాగే ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అలాగే కళాశాలలో కొనసాగుతున్న శీప్టింగ్ విధానానికి స్వస్తి పలకాలని అలాగే కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సిద్దిపేట పట్టణం లో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి అలాగే రోడ్డు పై బైఠాయించి పుస్తక పఠనం కార్యక్రమం నిర్వహించారు.అలాగే ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఈ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు మంత్రుల నివాసాల ముట్టడి చేపడుతామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో సిద్దిపేట నగర వైస్ ప్రెసిడెంట్ వంశీ,జోనల్ ఇంఛార్జి లు భాను,చందు,మని డిగ్రీ కళాశాల కార్యదర్శి బి వి గౌడ్,మహేష్,వినయ్,నరేష్,శ్రీహరి,అనిల్,పవన్ తదితరులు పాల్గొన్నారు..