క్వారెంటైన్ కి వెళ్లకుండా డైరెక్ట్ ఇంట్లోకే…

సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో గ్రామానికి చెందిన దూల్మిట్ట భాస్కర్ గత కొన్ని సంవత్సరాల నుంచి చెన్నై లోని పౌల్ట్రీ ఫామ్లలో పని చేసేందుకు వలస వెళ్ళాడు.కరోనా నేపధ్యంలో నిన్న రాత్రి ఏడుగంటల ప్రాంతంలో మునిగడప గ్రామానికి వచ్చాడు తిరిగి వచ్చాడు. అయితే బయటి ప్రాంతాల నుండి వలస వెళ్లి వచ్చిన వారు అధికారులకు తెలిపి క్వారెంటీన్ లో ఉండాల్సి ఉండగా. ఇతను మాత్రం ఏ అధికారికి తెలపకుండా వచ్చి ఇంట్లో చేరాడు. అది గమనించిన స్థానికులు ఆశా వర్కర్లు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్థానిక హాస్పటల్ మరియు పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది.విషయం తెలుసుకున్న జగదేవ్ పూర్ ఎస్సై సాయిరాం, డాక్టర్ల సిబ్బందితో వచ్చి ప్రస్తుత కరోనా నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గూర్చి భాస్కర్ కి తెలిపి ఇంట్లోనే ఉండాలని తెలిపి, క్వారెంటీన్ స్టాంప్ వేశారు.

error: