గల్ఫ్‌ బాధితులను స్వదేశానికి రప్పించాలి

గల్ఫ్ బాధితుల కష్టాలపై కేంద్ర‌ విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ నాగ ప్రసాద్‌తో ఎంపీలు వినోద్, బిబి పాటిల్, గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని‌ పలు జిల్లాల నుంచి గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కోరారు.

తెలంగాణలో క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్, మెద‌క్ జిల్లాల నుంచి వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఉపాధి కోసం గ‌ల్ఫ్ బాట ప‌ట్టారన్నారు ఎంపీ వినోద్‌ కుమార్‌. వీసా స‌మ‌యం ముగిసి, జీతాలు స‌రిగా లేక‌, ఏజెంట్ల మోసాల‌కు బ‌లవుతున్నారని వివరించారు.వారిని క్షేమంగా స్వరాష్ట్రానికి తీసుకు వ‌చ్చేందు‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుందని బాధిత కుటుంబాలకు ఎంపీ భరోసా కల్పించారు. బాధితుల‌కు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ అడిగిన అన్ని వివ‌రాల‌ను అందించామన్నారు. గ‌ల్ఫ్ దేశాల్లో మ‌గ్గ‌తున్న తెలంగాణ బాధితుల‌ను ర‌క్షించేందుకు అన్ని విధాలుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉన్నతాధికారుల‌ను కోరామని స్పష్టం ఎంపీ వినోద్‌ కుమార్‌ చేశారు.

 

error: