సిమ్లా: శీతాకాలంలో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో మంచు కురవడం సాధారణమే. కానీ ఇప్పుడు శీతాకాలం దాదాపు ముగిసిపోయింది. దక్షిణాదిలోనైతే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇవాళ విపరీతంగా మంచు కురిసింది. ఇక లాహౌల్ స్పితి జిల్లాలోని థాంగ్ గ్రామం నిండా మంచు కురవడంతో ఆ గ్రామంపై తెల్ల దుప్పటి కప్పినట్లుగా కనిపిస్తున్నది. ఈ సుందర దృశ్యం స్థానికులకు కనువిందు చేస్తున్నది. ఈ కింది చిత్రాల్లో మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.