ట్రంప్ అత్యంత చెత్త ప్రెసిడెంట్

అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రెసిడెంట్లలో ట్రంప్ ఒకరని ప్రెసిడెంట్ ఎలెక్ట్​ జో బైడెన్ అన్నారు. ప్రెసిడెంట్​గా కొనసాగేందుకు ట్రంప్ ఫిట్​గా లేరని తాను ఏడాదిగా చెప్తూనే ఉన్నానన్నారు. మరో 12 రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్​ను ఇంపీచ్​మెంట్ ద్వారా తొలగిస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. జవాబు దాటవేశారు. ట్రంప్​ను కొత్త ప్రభుత్వం ఏర్పడే జనవరి 20న రోజున తొలగించడమే అతిత్వరగా అవుతుందని కామెంట్ చేశారు. తన ప్రమాణ స్వీకారానికి రానని ట్రంప్ చేసిన ప్రకటన పట్ల బైడెన్ సంతోషం వ్యక్తంచేశారు.క్యాపిటల్ బిల్డిం గ్ లోకి చొరబడి అల్లర్లు సృష్టించిన కొంతమంది ఉద్యోగులు ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొం టున్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని జనం డిమాండ్ చేస్తున్నారు .

error: