ట్విట్టర్ కి ఇక ఉచిత సేవలు

ప్రజల అభిప్రాయాలను వెల్లడించే సోషల్‌ మీడియా వేదికల్లో ఒకటి ట్విట్టర్‌.. అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌.. సొంతమైంది. ఈ తరుణంలో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న దేశీయ సోషల్‌ మీడియా యాప్‌ ‘కూ’ యాప్‌.. ట్విట్టరీలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఉచితంగా సేవలందిస్తామని ప్రకటించింది.
సబ్‌స్క్రిప్షన్లతో ఇన్‌కం పెంచుకోవాలని తల పెట్టాడు ఎలన్‌ మస్క్‌. అందుకోసం ట్విట్టర్‌ బ్లూ టిక్‌. . వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ ఉన్న ఖాతాలు.. ఈ ఖాతాలకు సబ్‌స్క్రిప్షన్‌ పెట్టి.. నెలకు 20 డాలర్లు.. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.1600 సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు వసూలు చేయ సంకల్పించినట్లు వార్తలొచ్చాయి. ఎలన్‌మస్క్‌ ట్విట్టర్ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతున్నది.

ఈ తరుణంలో దేశీయ ట్విట్టర్‌గా పరిగణిస్తున్న ‘కూ’ యాప్‌.. ట్విట్టరీలకు బంపరాఫర్‌ ఇచ్చింది. ఉచితంగా సేవలందిస్తామని సంస్థ కో-ఫౌండర్‌ కం సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ట్వీట్‌ చేశారు. ట్విట్టరీలను తక్షణం ‘కూ’ యాప్‌లోకి మారండి అనే సంకేతమిస్తూ .. #SwitchtoKoo’ అనే హ్యాష్‌టాగ్‌ జత చేశారు.

బ్లూటిక్‌ ఖాతాల సబ్‌స్క్రిప్షన్‌తో ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న ఎలన్‌మస్క్‌ యోచనను తమ యాప్‌ విస్తరణకు అనుకూలంగా మార్చుకోవాలని కూ భావిస్తున్నట్లు తలుస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ పిలుపు మేరకు 2020లో ‘కూ’ యాప్‌ ఏర్పాటైంది.

 

error: