తనకంటూ ఎవరూ లేరని మనస్తాపానికి గురై ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీరామ సాయి ట్రస్ట్ ఆశ్రమంలో పోరెడ్డి అంకిరెడ్డి అనే వృద్ధుడు ఉంటున్నాడు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో 25 మంది వృద్ధులకు కరోనా సోకడంతో.. మిగతా ఆశ్రమాల్లోని వృద్ధుల పరిస్థితిపై ఆఫీసర్లుఆరా తీశారు. వృద్ధులకు సంబంధించి బంధువులుంటే ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. అలానే ఆశ్రమంలోని చాలామందిని ఇంటికి పంపించారు. ఏ దిక్కులేని 8 మంది మాత్రం అక్కడే ఉండిపోయారు. వారిలో ఒకరైన అంకిరెడ్డి తన వాళ్లంటూ ఎవరూ లేరని మనస్తాపానికి గురై మంగళవారం ఆశ్రమంలో ఉరేసుకున్నాడు.
Tags crime HANGING hyderabad JAMMIKUNTA karimnagar OLD MAN SUCIDE telangana
TS24 News