తనకోసమే ఇది ఒప్పుకున్నా – మోనాల్

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంతో ఫుల్ ఫేమ‌స్ అయిన రొమాంటిక్ క‌పుల్ అఖిల్ సార్ధ‌క్, మోనాల్ గ‌జ్జ‌ర్. వీరిద్ద‌రు జంట‌గా క‌నిపిస్తే అభిమానుల క‌ళ్ళ‌ల్లో ఆనందం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. అఖిల్‌, మోనాల్ జంట‌గా ఎవ‌రైన సినిమా చేస్తే బాగుండు అని సినీ ప్రేమికులు గ‌ట్టిగా కోరుకున్నారు. వారి కోరిక ఎట్ట‌కేల‌కు ఫ‌లించ‌గా, తెలుగు అబ్బాయి గుజ‌రాతీ అమ్మాయి అనే వెబ్ సిరీస్‌తో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అఖిల్ కోసమే ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసాన‌ని పేర్కొంది. నా స‌ర‌స‌న అఖిల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తార‌ని చెప్పేస‌రికి ఏ మాత్రం ఆలోచించ‌కుండా సైన్ చేశాడు. ప్రేక్ష‌కులు మా ఇద్ద‌రిని స్క్రీన్‌పై చూడాలిని చాలా అనుకుంటున్నార‌నే విష‌యం నాకు తెలుసు అని మోనాల్ స్ప‌ష్టం చేసింది. సరస్వతీ క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఎ. భాస్కర్ రావు ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. గుజరాత్ నుండి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి.. విలేజ్‌ నుండి సిటీకి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టొరీ నేప‌థ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుంద‌ట‌.

error: