తూములు ఏర్పాటు చేయాలనీ ధర్నా …

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల కేంద్రంలోని దాదాపు మూడు వేల మంది రైతుల పంట పొలాలకు పారకం కోసం ఎలాంటి తూము లేకపోవడంతో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద కాలువ దగ్గర రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టి దాదాపు రెండు గంటల పాటు రవాణా రాకపోకలు స్తంభింపచేశారు.దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ పెద్ద కాలువకు తూము ఏర్పాటుచేసి పంట పొలాలకు నీరు అందించాలని గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లిన చలనం లేదని మా ప్రాంతంలో ఉన్న పంట పొలాలకు నీరు లేక దూరప్రాంతాలకు నీరును తరలిస్తున్నారని ఇది అధికారులు , రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం అని మండిపడ్డారు. వెంటనే రెండు రోజుల్లో తూము ఏర్పాటు చేసి రైతుల పంట పొలాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ ఘటనపై సిఐ బన్సీలాల్ ముస్తాబాద్ ఎస్ ఐ లక్ష్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు రైతులు ససేమిరా అనడంతో పోలీసు స్టేషన్ కు తరలించారు

error: