కాంగ్రేస్,బీజేపీయేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తన మిషన్ అని ముఖ్యమంత్రీ కే.చంద్రశేఖర్ రావు ప్రకటించారు దీనిఫై నిర్మానాత్మక ప్రణాళికతో త్వరలో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఫై తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు దేశవ్యప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకంకావాల్సిన అవసరముందన్న కెసిఆర్ ..త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. ఒడిశా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం కోల్కతాలోని పశ్చిమ బెంగాల్ సచివాలయానికి చేరుకున్న కెసిఆర్ కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్వయంగా స్వాగతం పలికారు. ఆమెతో పాటు కెసిఆర్ ను స్వాగతించినవారిలో పలువురు మంత్రులు,అధికారులు ఉన్నారు. దాదాపు గంటపాటు సాగిన సమావేశంలో ఇద్దరు నేతలు ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ ఫై చేర్చించినట్టు సమాచారం అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఫై ఆదివారం నుంచి యాత్ర ప్రారంభించినారు. మొదట ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో,ఇప్పుడు మమతా భేనర్జితో భేటీ అయ్యానని చెప్పారు. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న శక్తుల ఏకీకరణ అన్నారు బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ అనేది మిషన్ ఆఫ్ కెసిఆర్ అని స్పష్టంచేసారు. దీనిపై తన ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.