దళితుల ధర్మ పోరాటంపై గులాబీ మార్క్ రాజకీయం అవసరమా ?
పోచమ్మ తల్లి దేవాలయం ముందే శవాన్ని బొందపెట్టడమేనా తెరాస హిందూ నీతి ?
తెరాస పార్టీ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకుంది ఇదేనా ?
నేను అంత హిందువును ఇంత హిందువును అనుడేనా …
పోచమ్మ తల్లి ముందు కులం కుంపటి రేపుతున్న సొంతపార్టీ నాయకులపై
చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా ?
అమ్మవారికి కొబ్బరి కాయ కొట్టాలో ? పూడ్చిన బొందకు కొట్టాలో ?
తెలియని అయోమయానికి గురి చేసే కుట్ర ఎవరిది ?
జనవరి ఆరు తారీఖున ఇచ్చిన నోటిస్ కు నాలుగు నెలల ముందే డేట్ వేసి సెప్టెంబర్ తేదీ పెట్టడం వెనుక రహస్యం ఏమిటి?
అరవై యేండ్లు దున్నుకుంటున్న భూమిని ఇతరులకు ఇచ్చే అధికార దుస్సాహసం ఎందుకు చేస్తున్నారు
పచ్చని పొలం రాజకీయ కుట్రలో భాగం అవ్వాలా ?
మిరుదొడ్డిలో ఒక్క పోచమ్మగుడి దగ్గరే భూమి ఉందా ? ఇంకా ఎక్కడ లేదా ?
RDO అబద్దాలు ఎందుకు చెప్తున్నారు
తాహసిల్దార్ ను సస్పెండ్ చెయ్యాలని కేసీఆర్ సొంత జిల్లాలో మండుటెండల్లో ధర్నా చెయ్యాలా ?
సిద్ధిపేట రెవెన్యూ యంత్రాంగం ఉన్నదా ఉంటే ఎవరి కనుసన్నుల్లో ఉంది ?
రైతులతో ప్రొసిడింగ్ ఇవ్వలేదని చెప్తూనే నాలుగు నెలల ముందే
నోరుతో నవ్వినట్టు నొసలుతో వెక్కిరించినట్టు దొంగ సాటుగా ఇతరుల పేరు మీద నాలుగు నెలల కిందనే ఎందుకు ఇచ్చినట్టు ?