నవంబర్ 26 నుండి 30 వరకు బ్యాంకుల సమ్మె

ఉద్యోగులకు వేతన సవరణ ప్రధాన డిమాండ్ గా నవంబర్ 26 నుండి 30 వరకు ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయాలనీ నిర్ణయించుకున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.దీంతో పాటు నవంబర్ 5 నుంచి 22 వరకు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చెయ్యాలని చెన్నైలో జరిగిన సమావేశంలో నిర్ణయించాయి.ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణను రూపొందించినట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.

error: