పరిపాలనా సౌలభ్యం కోసం .. ప్రజల సౌకర్యార్ధం మధ్య తేడా ఉందా?

పరిపాలనా సౌలభ్యం కోసం .. ప్రజల సౌకర్యార్ధం .. ఈ రెండూ వినడానికి ఒకేలా అనిపించినా దాని వెనక పెద్ద కథే ఉంటుంది …ప్రజల సౌకర్యాలను తాకట్టు పెట్టి పాలకుల సౌలభ్యం కోసం ..,,పరిపాలనా సౌలభ్యం కోసమని వక్కాణించడం ఈ రెండింటి మధ్య తేడా .

ఆ రోజుల్లో అధికారులు తాగటానికి చాయ్ హోటల్ ఉంటే చాలు మండల కేంద్రం , టిఫిన్ చేయడానికి హోటల్ ఉంటే చాలు జిల్లా కేంద్రం అన్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారేమో అని అనిపించకమానదు.జిల్లా హెడ్ క్వార్ట్రర్స్ కోసం వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి రావడానికి కారణం అదే .ఇక రాష్ట్రాల రాజధానులు సరే సరి …

ఇప్పుడు దేశ రాజధాని గురించి మాట్లాడుకుందాం …
విశాల భారత దేశం మనది అని గొప్పగా పాడుకుంటున్నా ఇక్కడ ఉత్తర భారతం దక్షిణ భారతం అని రెండు దేశాల మాదిరిగా పరిస్థితి ఉంది
ఎక్కడో తెలంగాణ లో మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తి దేశం దృష్టి ని ఆకర్షించాలి, దేశ రాజధానిలో తన నిరసన తెలియజేయాలి అంటే …నిరసన సంగతి దేవుడెరుగు అక్కడికి చేరేలోపు నీరసించి పోవడం ఖాయం . అదేదో విదేశీ యాత్రకు పోయినట్లు ఉంటుంది వ్యవహారం ….

ఇంకా మనదేశంలో ఎలాంటి మార్పులు జరగాలో మరో కథనంలో …..

error: