పార్టీ మారిన కాంగ్రెస్ నేత

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరారు టీఆర్ఎస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. మంగళవారం సాయంత్రం ఉత్తమ్.. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాస్‌తో పాటు పలువురు ద్వితియ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు బంగారు భవిష్యత్ ఉండాలని ఉత్తమ్ కోరుకున్నారు. శ్రీనివాస్ తండ్రి ముత్యంరెడ్డి ఆదర్శ నాయకుడని.. దుబ్బాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఉత్తమ్ కొనియాడారు. దుబ్బాక ఉపఎన్నిక.. తెలంగాణ భవిష్యత్ ఎన్నిక అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని అని నియోజకవర్గ ప్రజలను ఉత్తమ్ కోరారు.

error: