రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు పాఠ్య పుస్తకాల ధరలు పెరగనున్నాయి.పేపర్ ధరలు పెరిగిన నేపథ్యములో వచ్చే విద్యా సంవత్సరంలో పుస్తకాల ఫై దరల పెరుగుదల ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.పాఠ్య పుస్తకాలకు ఉపయోగించే పేపర్ టన్నుకు రూ.5 వేల వరకు అదనంగా ధర పెరిగిందని,దీంతో పుస్తకాల ధరలు 10% నుంచి 15%వరకు పెరిగే అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు అందించే పుస్తకాలపై పెరిగే ధరలను ప్రభుత్వం భరించాల్సి వస్తుంది.ప్రైవేట్ పాఠశాలల్లో చదివే మరో 30 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఫై మాత్రం భారం పడనుంది.వీటి కోసం టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
TS24 News