ప్రజల కష్టసుఖాలను ,తెలంగాణ గుండె చప్పుళ్లను తన పాటలతో ఎలుగెత్తి చాటిన ప్రముఖ తెలుగు కవి,గాయకుడు నిసార్ మహమ్మద్ ఇక లేరు.కరోనా వైరస్ తో ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆర్టీసీలో కండక్టర్ గా ,డిపో కంట్రోలర్ గా పనిచేసిన నిసార్ కొన్ని దశాబ్దాలుగా పాటలతో ప్రజా ఉద్యమాలకు ఊపునిచ్చారు…కరోనా పై పాట వినిపించారు…ప్రస్తుతం తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Tags carona virus Govt Telangana nalgonda nisaar mahammad telangana ts24news
TS24 News