ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్(51)ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు.2019 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని పూణే నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత వెల్లడించారు.మాధురి దీక్షిత్ కి ఇదే మంచి అవకాశమని తాము భావిస్తున్నట్లు తెలిపారు.కాగా ఈ ఏడాది జూన్ లో సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా మాధురిని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలిసిన సంగతి తెలిసిందే.