ప్రియుడిని చంపిన ప్రియురాలు

పెళ్ళికి నిరాకరించాడని ప్రియుడిని చంపింది ఓ ప్రియురాలు .పెళ్లి వద్దంటున్నాడని కోపం , మరొకరిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో ప్రియుడిని హత్య చేసింది ప్రియురాలు .ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం – కాపవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది .గ్రామీణ సీఐ కథనం ప్రకారం …
తాళ్లపూడి మండలం మలకపల్లి కి చెందిన గార్సికూటి పావని,తాడేపల్లిగూడెం పాతూరు కి చెందిన అంబటి కరుణ తాతాజీరావు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఏడాది నుండి పెళ్లి చేసుకొమ్మని అడుగుతున్న తాతాజీరావు నిరాకరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు.మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్ళింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు.ఆమెను దింపడానికి మలకపల్లి వెళ్తుండగా…ద్విచక్రవాహనంపై వెనుక కూర్చుని ఉన్న పావని వెనకాల నుండి కత్తితో వీపులో పొడిచింది.దీంతో కింద పడిపోయిన తాతాజీ మెడ, తల,వీపుపై పొడిచింది.తీవ్ర గాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు.ఆ దారిలో వెళుతున్న వారు చూసి పోలీస్ లకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: