కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని దీనినికంట్రోల్ చేయడానికి సరైన మందులు కనిపెట్టడమే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికార ప్రతినిధి డేవిడ్ నాబర్రో పేర్కొన్నారు.కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టేవరకు ప్రమాదం మనల్ని వెన్నంటే ఉంటుందన్న విషయాన్నీ అన్ని దేశాల ప్రజలు గ్రహించాలని అయన కోరారు.ఈ వైరస్ ను తాము అదుపు చేసేందుకు ప్రయత్నిసున్న అది తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని, ఈ ముప్పు నుంచి ప్రపంచం ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తి ని, రోగులని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అప్రమత్తమై ఐసోలేసన్ లో వ్యాధిని నియంత్రించడమే మార్గమని నాబర్రో అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రపంచ దేశాలన్నీ ఈ విధానాన్ని పాటించక తప్పదని ఇంతకు మించి అప్సన్ లేదని అయన తెలిపారు. అనేక దేశాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ లాక్ డౌన్ ఆంక్షలు విధించారని, ఇప్పుడా ఆంక్షలను సడలించడం అంటే వైరస్ వ్యాప్తికి అవకాశమిచ్చినట్టేనని, మరి ఈ సమస్యకు పరిస్కారం దొరికేదాకా లాక్ డౌన్ లు పొడిగించడం పై ఆయా దేశాలు మరోసారి ఆలోచించుకోవాలని అయన సూచించారు