భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. భారత్ – చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికలు మధ్య ఘర్షణలు జరిగి 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో ఇటీవల చైనా యాప్స్, వస్తువులపై బ్యాన్ విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ఈ సమయంలో భారత ప్రభుత్వం చైనాకు భారీ షాక్ ఇచ్చింది. భారత సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, శాంత్రి భద్రతలకు ప్రమాదంగా మారిన యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ యాప్స్‌లో భారతీయులు చాలా ఎక్కువగా వాడే టిక్‌టాక్, షేరిట్, హలో, క్లబ్ ఫ్యాక్టరీ వంటి పలు యాప్స్ ఉన్నాయి.