మండిపోతున్న ఎండలు

రాష్ట్ర‌వ్యా‌ప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరు‌గు‌తు‌న్నది. ఆది, సోమ‌వా‌రాల్లో గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు సాధా‌రణం కంటే మూడు డిగ్రీల మేర పెరిగే అవ‌కా‌శా‌లు‌న్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కా‌రులు హెచ్చ‌రిం‌చారు. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలు‌ల‌తో గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు పెరు‌గు‌తున్నాయని తెలి‌పారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉష్ణో‌గ్ర‌తలు పెరిగే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొ‌న్నారు. శని‌వారం ఆది‌లా‌బా‌ద్‌లో 38 డిగ్రీలు, భద్రా‌చ‌లంలో 38.5 , హన్మ‌కొం‌డలో 35, హైద‌రా‌బా‌ద్‌లో 37.2, ఖమ్మంలో 36.2, మహ‌బూ‌బ్‌‌న‌గ‌ర్‌లో 37.4, మెద‌క్‌లో 37 డిగ్రీలు, నల్ల‌గొం‌డలో 34.4 డిగ్రీలు, నిజా‌మా‌బా‌ద్‌లో 37.5 డిగ్రీలు, రామ‌గుం‌డంలో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత రికా‌ర్డ‌యింది.

error: