మనదగ్గర కరువు అనే పదానికి డిక్షనరీ లో అర్థం వెతకద్దు-హరీష్ రావు

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గా గ్రామంలోని సిద్ధిపేట వాగుపై బుధవారం సాయంత్రం రూ.2.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యాము నిర్మాణానికి శంకుస్థాపనతో పాటుగా., మండలంలోని ఖాతా గ్రామంలోని పెద్ద వాగుపై రూ.9.35 కోట్ల వ్యయంతో ఒక దానికి రూ.4.60 కోట్లు, మరొక దానికి రూ.4.75కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రెండు-2 చెక్ డ్యాములకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖాతా గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి గారు మాట్లాడారు.

– నంగునూరు మండలంలో కొత్తగా మూడు-3 చెక్ డ్యాముల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం.

– నంగునూరు మండలంలో కిలో మీటరుకు ఒక్క షేక్ హ్యాండ్ చెక్ డ్యాముల చొప్పున నంగునూరు పెద్ద వాగుపై ఇప్పటికే ఏడు-07 చెక్ డ్యాములు పూర్తి చేసుకున్నాం. ఇవాళ శంకుస్థాపన చేసిన మరో రెండు చెక్ డ్యాములను కలుపుకుని తొమ్మిది- 9 చెక్ డ్యాములు నిర్మాణం చేసుకున్నాం.

– కాళేశ్వరం జలాలు ప్రతి చుక్క చెక్ డ్యాములు తాకేలా, పెద్ద వాగుపై 365 రోజులు చెక్ డ్యాముల్లో మత్తడి దూకేలా ఏర్పాట్లు పూర్తి చేశాం.

– నంగునూరు మండలంలో కరువు అనే పదానికి డిక్షనరీలో అర్థం వెతకొద్దు. కాలం కోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి ఉండదని., పెద్ద వాగుపై నీళ్ల ప్రవాహం.. నిండు గర్భిణీలా., నిండు కుండలా.. ఉంటుంది.

– రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూనే ప్రభుత్వం వాటి అమలుకు చర్యలు చేపట్టింది.

error: