మిద్దె తోటలు …రసాయనాలు లేని మేడ మీది తోటలు

 

ఎవరైనా పంటలు ఎక్కడ పండిస్తారు ? పొలాలలో లేదా మంచి నీటి ఆధారం ఉన్న దగ్గర పండిస్తారు .కానీ ఇక్కడ కొంత మంది సిద్దిపేట కు చెందిన ఉద్యోగులు పొలాల్లో నీరు ఉన్న దగ్గర కాకుండా వింతగా ఆలోచించారు .వారి పొలాలలో కాకుండా నీటి కోసం చూడకుండా వారే స్వంతంగా వినూతనంగా అలోచించి అందరి మన్ననలు పొందుతున్నారు …మరి వారు పండించే పంటలు ఎక్కడో కాదండోయ్ …
వారు నివసించే మేడల మీదే .నీటికి ఇబ్బంది లేకుండా , బయటికి వెళ్లి తెచ్చుకొనవసరం లేకుండా మేడ మీదే అన్ని పంటలు వేశారు .అవి వేయడానికి ప్రత్యేకంగా కుండీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేస్తున్నారు.
గులాబీ, బంతి, మల్లె వంటి ఎన్నో రకాల పుల మొక్కలతో పాటు వంకాయ, టమాటా, కాకర, బెండ బీర, వంటి కూరగాయలు, రామతులసి, కృష్ణతులసి, కలబంద వంటి ఔషధ మొక్కలతో పాటు స్ట్రాబెరి, జమ, ద్రాక్ష తదితర పండ్ల మొక్కలను సైతం ఈ ఉద్యోగులు పండిస్తున్నారు.

సిద్దిపేటలో ప్రకృతిఫై ప్రేమ వ్యవసాయం కుటుంబం నేపథ్యం కలిగిన ఆరోగ్యం ఫై అవగహన కలిగిన సిద్దిపేటకు చెందిన పలువురు ఉపాధ్యాయులు వైద్యులు సిద్దిపేట లొ ఇంటి మిద్దెఫై తోటలను సాగు చేస్తున్నారు అదేవిదంగా కొంతమంది బాల్కనీలొ కూడా సాగు చేస్తున్నారు.రాదారి నాగరాజు ,రవీందర్ రెడ్డి,సూర్యప్రకాష్ ,Dr స్వామి దంత వైద్యులు తదితరులు మిత్ర గ్రూప్ అని సమూహాన్ని ఏర్పాటు చేసుకొని కొత్తగా వారికి కావాల్సినవి పండిస్తున్నారు .

రాధారం నాగరాజు :-

నాకు ప్రకృతి తో అనుబంధం, ఆరోగ్యం ఫై అవగహన తో పర్యావరణ పరిరక్షణ ద్వేయంగా మా ఇంటిపై మిద్దె తోట సోలార్ పవర్ గ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్నాను
మా ఇంటి ఫై మాకు కావలసిన అన్ని కూరగాయలు ఆకుకూరలు పండించిన వాటిని మేము ఇంటిలో వాడుతున్నాము అదే విదంగా 200 మంది తో సిద్దిపేట మిద్దె తోటలు అనే గ్రూప్ లొ అవగాహనా కల్పిస్తున్నాం మిద్దె తోట మిత్ర గ్రూప్ ద్వారా సలహాలు సూచనలు సమస్యలు పంచుకుంటున్నాము.

error: