నువ్వు ఈ భూమి పైకి రాకుండా ఉండి ఉంటే
జాతి మొత్తం ఎన్ని అవమానాలతో,అసమానలతో నిండిపోయేదో…
బానిసత్వం ప్రజల గుండెల మీద నాట్యం చేసేది…
అతి నీచమైన సంస్కృతి దేశ నలుమూలలా అలాగే ఉండిపోయేది…
బలహీన వర్గాల వారికే బతుకేలేదు
మనుషులు మనుషుల్లా కాకుండా జాతి ,
కులం అంటూ యుద్ధాలే జరిగేవి…
మనుషులు మనుషుల్లా బతికే అవకాశమే లేకపోయేది…
అసమానతలను పారద్రోలిన బోధిసత్వుడవు నువ్వు …
కుల,మత,వర్గ తేడాలు చూపకూడదు అని
నవ భారత రాజ్యాంగం రచించావు
అంబేద్కరా…!
నువ్వు లేని ఈదేశం అజ్ఞానాంధకారం.
( డా౹౹ బాబాసాహేబ్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా )
— సౌమ్య వీరబత్తిని —