ఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ట్రయల్‌కు రెడీగా ఉన్నానని హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఆదివారం జరిగిన ‘సండే సంవాద్’ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వాలంటీర్‌గా ఉండడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. హెల్త్ వర్కర్లకు, వృద్ధులకు, ఎమర్జెన్సీ పేషెంట్లకు వ్యాక్సిన్‌ను ముందుగా అందిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ రేట్, సేఫ్టీ, ప్రొడక్షన్ సహా పలు అంశాలపై చర్చిస్తున్నామని చెప్పారు. రెమ్‌డెసివిర్ సహా పలు మందుల విషయంలో కంప్లైంట్స్ వస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ బోర్డ్‌కి సూచించామన్నారు.