సంక్రాంతి తర్వాతే పాఠాశాలలు ప్రారంభం

సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి 9, ఆపై తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో త్వరలో మిగిలిన తరగతులకు కూడా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రికి విద్యాశాఖ ప్రతిపాదనలు చేరాయి. మంత్రులు, కలెక్టర్లతో నేటి సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్‌. తరగతుల ప్రారంభానికే సర్కారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కరోనా కరాణంగా ఏడాది పాటు స్కూల్స్, కాలేజీలు అన్నీ బంద్ అయ్యాయి.
సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ముందుగా 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్‌రూం విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు ఏడాది పాటు విద్యా సంవత్సరం విద్యార్థులు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది జూన్ వరకు విద్యా సంవత్సరం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో స్కూళ్లు తెరుచుకుంటున్నాయని సంతోషపడాలా? లేక కరోనా భయంతో ఇంట్లోనే ఉంచాలా? అనేది తల్లిదండ్రులు తేల్చుకోలేని పరిస్థితి.

error: