స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్ పర్సన్ శోబా, ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు త్యాగాలను స్మరించుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో వజ్రోత్సవ సంబరాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.
ఈ తరానికి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి తెలిపేందుకు వజ్రోత్సవ సంబురాలు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరపలేకపోవచ్చు.
భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకున్న నాయకులకు ధన్యవాదాలు.
భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే మన తెలంగాణ ప్రాంతం 1948 లో భారతదేశంలో విలీనం చేయబడింది.
తెలంగాణ రాష్ట్ర సాధన సైతం గాంధేయ మార్గంలో అహింస మార్గంలో ఉద్యమం నడిపి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు.
గాంధీజీ గారు నమ్మిన సిద్ధాంతం గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడుతుందనే సిద్ధాంతం బలంగా నమ్మిన వ్యక్తి కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ ది.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన కళ్లముందు కనబడుతుంది అని ఆయన అన్నారు

error: