హిజ్రాగా మారిన యువకుడు, మరో యువకుడితో ప్రేమలో పడితే?

హిజ్రాగా మారిన కుర్రాడు.. యువకుడితో ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. వాట్సాప్ వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలిక పరిధిలోని నక్కలబండ తండాలో జరిగింది. తండాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఏడాది క్రితం అదృశ్యమయ్యాడు. అప్పటినుంచి అతడి ఆచూకీ లభించలేదు.

కట్ చేస్తే.. తాను ఇప్పుడు అబ్బాయిని కాదు అమ్మాయి అంటూ ప్రత్యక్షమయ్యాడు. హిజ్రాగా మారిపోయినని, తనపేరు ఇప్పుడు శ్రీకాంత్ కాదని.. శ్రీలేఖగా మార్చుకున్నానని చెప్పాడు. తాను ప్రస్తుతం కడపలో ఉన్నానని, తనతో పాటు మరో ముగ్గురు కూడా హిజ్రాలుగా మారిపోయినట్టు తెలిపాడు. ఇదంతా తన మేనమామ కొడుకు వినోద్ కు వాట్సాప్ వీడియో కాల్ చేసి మరి చెప్పుకొచ్చాడు.

తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతడికి మరో అమ్మాయితో పెళ్లి అయిందని, తాను చనిపోతున్నానంటూ మాట్లాడుతూనే పురుగుల మందు తాగేశాడు. ఈ విషయాన్ని జడ్చర్ల పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా కడప పోలీసులకు సమాచారం అందించి శ్రీకాంత్ అలియాస్ శ్రీలేఖను గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

error: