హుస్నాబాద్ లో తొలి బహిరంగసభ

సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లోకి వెళ్లేందుకు టీఆర్ఎస్ సిద్ధమయ్యింది. ప్రజల ఆశీర్వాద బహిరంగ సభ పేరుతో 50 రోజుల్లో వంద సభలు నిర్వహించనున్నది. ఈ సభలకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడుతున్నారు.

పండితుల సూచన మేరకు శ్రావణ మాసంలో బహిరంగ సభ ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్‌లో తొలిసభను నిర్వహిస్తున్నామన్నారు.

హుస్నాబాద్ బస్ డిపో పక్కనున్న మైదానంలో ఈ నెల 7న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజల ఆశీర్వాద తొలి బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మంత్రి హరీశ్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి సీఎం కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ ఉంది. ఏ కార్యక్రమమైనా అక్కడి నుంచి ప్రారంభిస్తే విజయవంతం అవుతుందని ఆయన నమ్మకం. ప్రజలంతా ఈ సభకు తరలిరావాలని కోరారు.

error: