ఆదివారం నాడు ఒఆర్ఆర్పై బైక్లు, ట్రాక్టర్లను అనుమతించమని ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ల కోసం ప్యాబ్ సిటీలో పార్కింగ్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, స్పెషల్ పార్టీకి చెందిన 20 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
ట్రాఫిక్ స్తంభించకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. సభా వేదిక, పార్కింగ్ ప్రదేశంలో కూడా మంచినీటి వసతి కలిపించామన్నారు. పార్కింగ్ స్థలంలో 400 మంది వలంటీర్లు సేవలందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం జరిగే టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం 20వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని రాచకొండ సిపి మహేశ్ భగవత్ తెలిపారు. సభకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
TS24 News