ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ కు 30 km ల సమీపంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రమోటెడ్ సంస్థ బిలై స్టీల్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.మరో 14 మందికి గాయాలయ్యాయని,వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.గ్యాస్ పైపు లీకవడంతో ఈ ఘటన జరిగినట్లు,వారిలో 24 మంది షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.