మోదికి భయపడే కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించాడు.నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో పలు పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన,తాము అధికారంలోకి వస్తే కొడుకులు,కూతుర్లు అధికారంలో ఉండరని అన్నారు.అభివృద్ధి కోసమే ముందస్తుకు వెళ్లామని తెరాస కట్టుకథలు చెప్తుందని,ఎన్నికల తరువాత కొడుకు లేదా కుమార్తెను సీఎం చేయడానికే కెసిఆర్ ముందస్తుకు వెళ్లారని విమర్శించారు.