ప్రముఖ సంస్కృత పండితులు, కవిశాబ్దిక కేసరి మహా మహోపాధ్యాయ శ్రీ రఘునాథాచార్య స్వామి మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీ రఘునాథాచార్య స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీ రఘునాథాచార్య స్వామి మృతి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు అన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా సంప్రదాయ పరంపరను కొనసాగిస్తూ జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన వ్యక్తి శ్రీ రఘునాథాచార్య స్వామి అన్నారు. తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనిషి అని కొనియాడారు