నాగర్ కర్నూల్ కొండనాగుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అక్కడ ఆహారం బాగాలేదంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.అక్కడి సమస్యలను వెంటనే తెలుసుకోవాలని ఆయన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.దీంతో రంగంలోకి దిగిన డీఈవో పాఠశాలలో తనిఖీ చేయగా పాఠశాలలో భోజనాలు సరిగా లేవని,ఉపాధ్యాయులు కొడుతున్నారని విద్యార్థులు పిర్యాదు చేశారు.