13,22,848 మందికి కళ్లద్దాలు పంపిణీ

అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో 72,14,758 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు.పౌరులెవరు కంటి చూపు కోల్పోవద్దన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విస్తృతంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఏది ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు 4,117 గ్రామాలు,301 వార్డుల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 72,14,758 మందికి కంటి పరీక్షలు చేయగా 13,22,848 మందికి కళ్లద్దాలు అందచేశారు.

error: