ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం చేపట్టారు.రెండు రోజుల పాటు నిర్వహించే ఈ యాగం ఆదివారం ప్రారంభమైంది.సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది.అదే రోజు ఏకరాత్రి దీక్షలు ఉంటాయి.తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని,అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆఖాంక్షిస్తూ ఈ యాగం తలపెట్టారు.రాజశ్యామల యాగంలో భాగంగా సూర్యనమస్కారాలు,మహాలింగార్చన.అన్ని గ్రహాలకు హోమాలు,చండీయాగం నిర్వహించారు.విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది ఋత్వికులు పాల్గొన్నారు.సీఎం కేసీఆర్ సతీమణి శోభా,ఇతర కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.