కాల్వలో పడిన బస్సు;30 మంది జల సమాధి

కర్ణాటకలో ఘోర రోడ్ ప్రమాదం సంభవించింది.ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోయింది.ఈ దుర్ఘటనలో 30 మంది మరణించారు.మృతుల్లో ఎక్కువగా పాఠశాల విద్యార్థులు,మహిళలు ఉన్నారు.ఈ విషాదం మాండ్య జిల్లాలో చోటు చేసుకుంది.శనివారం పాఠశాల ఒక్కపూట మాత్రమే పని చేసింది.విద్యార్థులు బస్సులో ఇండ్లకు బయలుదేరగా పాండవపుర తాలూకాలోని కనకానామరాది వద్ద ఉన్న వీసీ కెనాన్ లో పడిపోయింది.దీంతో 30 మంది జలసమాధి ఐయ్యారు.విషయం తెల్సిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని ముగ్గురిని రక్షించారు.తర్వాత అధికారులు,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో 30 మంది మృతదేహాలను వెలికి తీశారు.విద్యార్థుల తల్లితండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతటా తీవ్ర విషాదం అలుముకుంది.పోలీసులు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.

error: