మళ్ళీ ఉగ్రవాదుల దాడి

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ఉగ్రవాదుల దాడిలో 43మంది జవాన్లు మరణించిన ఉదంతం ఇంకా మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది.  జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పింగ్లన్ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో భద్రతా బలగాలు కూడా కాల్పులకు దిగాయి.

ఉగ్రవాదుల దాడిలో మేజర్ సహా ముగ్గురు జవాన్లు మరణించారు. రాష్ట్రీయ 55వ రైఫిల్స్ దళానికి చెందిన వారుగా వీరిని అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం.

పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాదుల ఘాతుకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 43మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులు తాజాగా కొన్ని గంటలు కాకముందే రోజుకోరకంగా దాడులకు దిగుతున్నారు. శనివారం  రాజౌరీ జిల్లాలో వారు అమర్చిన ల్యాండ్ మైన్ నిర్వీర్యం చేసే క్రమంలో ఆర్మీ అధికారి మృతిచెందిన సంగతి తెలిసిందే.. తాజా ఘటనలో మేజర్ సహా ముగ్గురు జవాన్లు మృతిచెందడంతో దేశంలో మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

error: